ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయపై మండిపడ్డా రాహుల్‌

కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కొవిడ్‌19 దాడి కాదు..పేదలపై దాడి

rahul-gandhi

న్యూఢిల్లీ: మోడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ కొవిడ్‌19 దాడి కాదని, పేదలపై దాడని అన్నారు. లాక్‌డౌన్‌ నిర్ణయం.. నోట్ల రద్దు నిర్ణయం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ హడావుడిగా అమలు చేసిన అనంతరం అసంఘటిత రంగంపై జరిగిన మూడో దాడిగా పేర్కొన్నారు. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాని మోదీ విపత్తు ప్రణాళికలే కారణమని ఆరోపించారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడం అసంఘటిత రంగానికి మరణశిక్ష వంటిదన్నారు. ’21 రోజుల్లో కరోనాను అంతం చేస్తామని వాగ్ధానం చేసిందని, కానీ కోట్ల ఉద్యోగాలు, చిన్న పరిశ్రమలను ముగించారు’ అని విమర్శించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. ‘న్యూన్‌తమ్‌ ఆయ్‌ యోజన వంటి పథకాలు అమలు చేయాలని, డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కావాలని, కానీ వారు అలా చేయడం లేదు’ అని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/