సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎంపీ లేఖ..నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది

MP Raghurama krishna Raju
MP Raghurama krishna Raju

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖ రాసారు. తనను , తన కుటుంబ సభ్యులను చంపేందుకు కుట్ర జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. తాజాగా రఘురామ ఆయన కుటుంబ సభ్యుల ఫై ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ భాషా గ‌చ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న తనపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల ఫై ఫైల్ చేసారు.

దీనిపై రఘురామ కేసీఆర్ కు లేఖ రాసారు. జులై 4న తన ఇంటి సమీపంలోని కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా అందులో ఒకరిని సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారని… అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన బాషా అని చెప్పాడని రఘురామ తన లేఖలో తెలిపారు. ఐడీ కార్డు అడిగితే చూపించలేదని, ఉన్నతాధికారుల వివరాలు కూడా చెప్పలేదని పేర్కొన్నారు. దీంతో అతడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని.. కానీ ఏపీ పోలీసులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించాలని లేఖలో కోరారు. మరోవైపు కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ప్రకటించింది. అయితే రఘురామ ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసుల వివరణ భిన్నంగా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద కానిస్టేబుల్‌ ఫరూక్‌ నిఘా విధులు నిర్వర్తిస్తున్నారని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ చెబుతుండగా… ఫరూక్‌ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు.