ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలుసిసలైన అప్డేట్ ఇచ్చారు రాధే శ్యామ్ టీం. ఈ మూవీ తాలూకా మొదటి​ సాంగ్​ను నవంబరు 15న సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపి ఆనందం నింపారు. 1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్(చేయి చూసి భవిష్యత్తు చెప్పే వ్యక్తి) కనిపించనున్నారు. ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేస్తోంది.

యూవీ క్రియేషన్స్​ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..ఈ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను రాధే శ్యామ్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా తో పాటు ప్రభాస్ ..ఆదిపురుష్ , సలార్ , స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు.