మొదలైన ఆస్కార్‌ అవార్డుల సందడి

Oscar awards
Oscar awards

లాస్‌ఏంజిల్స్‌: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డు ఖఆస్కార్‌గ ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. హాలీవుడ్‌ సినిమా పండగగా అభివర్ణించే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అయితే 92వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకు అవార్డులను ప్రకటించారు. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రాడ్‌ పిట్‌ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఖవన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌‌గ చిత్రంలో నటనకు గానూ ఆయన్ని ఈ అవార్డు వరించింది. ఇక ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ చిత్రంగా ఖటాయ్‌ స్టోరీ 4గకు అవార్డు లభించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/