రాధే శ్యామ్ టీజర్ టాక్ : నాకు అన్నీ తెలుసు కానీ..మీకు ఏమీ చెప్పను

రాధే శ్యామ్ టీజర్ టాక్ : నాకు అన్నీ తెలుసు కానీ..మీకు ఏమీ చెప్పను

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ టీజర్ లో ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు అదిరిపోయాయి.

“నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ. మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు” అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఆసక్తి రేపుతోంది. టీజర్ లో టవర్ కూలిపోవడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే సినిమా విషాదాంతంగా ముగియనుందా ? అనే సందేహం వస్తోంది. ఏదేమైనా చాలాకాలం నుంచి టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. జనవరి 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.