18 నుండి 26 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
18న బడ్జెట్
telangana-assembly-session-ends-on-march-26
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు దివంగత సభ్యులకు సభ సంతాపం తెలుపనుంది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సమాధానం ఇవ్వనున్నారు. 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19, 21 తేదీల్లో శాసనసభ సమావేశాలకు సెలవులు ప్రకటించారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. 26వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/