రేపు ”రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ విడుదల

రేపు ”రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ విడుదల

ప్రభాస్ – పూజా హగ్దే కలయికలో తెరకెక్కుతున్న పాన్ మూవీ రాధే శ్యామ్..జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ , సాంగ్ , పోస్టర్స్ ఆసక్తి పెంచగా..రేపు సినిమా నుంచి లవ్ ఆంథెమ్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ మేరకు పోస్టర్ పోస్టర్ విడుదల చేయగా.. ఇందులో ప్రభాస్ అలాగే పూజా హెగ్డే రొమాంటిక్ యాంగిల్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

‘రాధే శ్యామ్’ సినిమాని యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో 70ల కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తుండగా.. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించనుంది.