బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మృతి

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) కన్నుమూశారు. గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్కాట్ లాండ్ లోని బాల్మోరల్ కోటలో ఆమె మరణించారు. గత ఏడాది అక్టోబర్ లో రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చారు. ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆమెని పర్యవేక్షించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.

బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి ఆమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు 70 ఏళ్లుగా రాణిగా కొనసాగుతున్నారు. ఆమె హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానులు పనిచేశారు. రాణి ఎలిజబెత్ 2 అస్తమయంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసినట్లైంది.