‘క్వీన్’ 2వ సీజన్ పై భారీ అంచనాలు

త్వరలోనే అధికారిక ప్రకటన !

Ramya Krishna
Ramya Krishna

‘బాహుబలి`లో రమ్యకృష్ణ పోషించిన  శివగామి పాత్ర ఆమెకు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ పలికించిన అభినయం దేశం మొత్తాన్ని మంత్రముగ్దులను చేసింది . రమ్యకృష్ణ మరో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించారు. అదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా అసమాన అభినయం.

జయలలిత జీవిత కథ ఆధారంగా గౌతమ్ మీనన్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘క్వీన్’ యువతరంలో హాట్ టాపిక్ అయ్యింది. టైటిల్  పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ పలికించిన అభినయానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ లో ‘బెస్ట్ ఒరిజిల్ ప్రోగ్రాం’గా అవార్డుని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తను నటించిన తొలి వెబ్ సిరీస్ కు అరుదైన గౌరవం దక్కడంతో రెండవ సీజన్లో నటించడానికి తాను సిద్ధంగా వున్నానని రమ్య కృష్ణ. చెబుతోంది .

‘క్వీన్’ రమ్య కృష్ణ నటించిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ ఇది. వెబ్ వరల్డ్ లో ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించింది. జయలలిత పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు లభించడంతో రెండవ సీజన్ పై భారీ అంచనాలున్నాయి.

ఈ సిరీస్ ఎప్పుడెప్పడు మొదలవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం వుందని తెలిసింది. 

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/