పండుగకు సందడి చేస్తానంటోన్న రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇక దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు సంబంధించిన టీజర్‌లను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తుండటంతో, రాధేశ్యామ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను కూడా ఈ సమయంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే సంక్రాంతి కానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రాధేశ్యామ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు టీజర్‌ను రెడీ చేశారని, పండుగ కానుకగా దీన్ని రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి రాధేశ్యామ్ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే అది రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.