తమిళ బుల్లితెర స్టార్ నటి ఆత్మహత్య

అర్థరాత్రి వరకు షూటింగ్ లో పాల్గొని హోటల్ కి తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే దుర్ఘటన..

VJ Chitra-File
VJ Chitra-File

తమిళ బుల్లి తెరపై స్టార్ నటి వీజే చిత్ర నేడు తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకోవడం అందరికి షాకింగ్ గా ఉంది. నిన్న అర్థరాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర హోటల్ కి తిరిగి వచ్చి కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈమె ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు తెలియరాలేదు. ఇటీవలే ఈమెకు చెన్నైకు చెందిన వ్యాపారవేత్తతో వివాహం ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం కూడా జరిగింది.

మరి కొన్ని వారాల్లో వీరి పెళ్లి కూడా ఉంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.

ఈసమయంలో చిత్ర ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా బుల్లి తెర స్టార్ గా వెలుగు వెలుగుతున్న వీజే చిత్ర ఆత్మహత్య ఆమె అభిమానులకు కన్నీరు మిగిల్చింది.

చిత్ర ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర మరణంపై తమిళ బుల్లి తెర పరిశ్రమ వర్గాల వారు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. 

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/