మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో..

నిహారిక పెళ్లి వేడుక..

Niharika wedding-All mega heroes in one frame
Niharika wedding-All mega heroes in one frame

నిహారిక కొణిదెల కలల వివాహం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ (రాజస్థాన్)లో నేటి(బుధవారం) సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు వెన్యూ వద్దకు హాజరై ఇప్పటికే సందడి చేస్తున్నారు.

వివాహానికి పూర్వ వేడుకల నుండి అనేక ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలాన్ని చుట్టు ముట్టాయి. ఇప్పటికే సంబరాలు పీక్స్ కి చేరుకున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ సహా మెగా కుటుంబంలోని హీరోలంతా  నిన్నటి సాయంత్రమే వేదిక వద్దకు చేరుకుని సందడి చేశారు. కుటుంబం మొత్తం పెళ్లి వేడుక కోసం ఉదయపూర్ చేరుకుంది.

మంగళవారం సాయంత్రం నిహారిక మెహెంది వేడుక కన్నుల పండుగగా సాగగా ఈ ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోల్లో సంథింగ్ స్పెషల్ ఫోటో ఒకటి అంతర్జాలంలోకి వైరల్ గా దూసుకెళుతోంది.

ఇందులో టోటల్ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. ఇలా జరగడం చాలా అరుదు. ముగ్గురు సోదరులు చిరంజీవి- నాగబాబు- పవన్ కల్యాణ్ సహా మెగా యువహీరోలంతా ఈ ఫోటోలో కనిపించారు.

ఈ  ఫోటోలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహం పెంచింది.

అల్లు అర్జున్- శిరీష్ – బాబి త్రయం .. అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. వీరితో పాటు రామ్ చరణ్- వరుణ్ తేజ్- సాయి తేజ్- వైష్ణవ్ తేజ్ – కళ్యాణ్ దేవ్ కనిపించారు. ఈ ఫోటోలోనే కాబోయే హీరో.. నిహారిక హబ్బీ చైతన్య జొన్నలగడ్డ ఉన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/