పథకాల అమలుతో గుణాత్మక విద్య సాధ్యమా?

Class Room (File)

బాలలదినోత్సవం నాడు ‘మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ‘మనబడి నాడు-నేడులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12వేల కోట్లను కేటాయించనుంది. తొలి దశలో 15,715 పాఠశాలల్లో తొమ్మిది రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికోసం ఇంత భారీస్థాయిలో నిధులు తొలిసారిగా రాష్ట్రప్రభుత్వం కేటాయించింది.

మనబడి నాడు-నేడు కార్యక్రమం పర్య వేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కల్పించేందుకు నిర్దేశించిన ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం విధివిధా నాలు ఖరారు చేసి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాఠశాల విద్యాశాఖ పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, సాంఘిక, బిసి, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44512 పాఠశాలల్లో 2019-2020 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు.

మార్గదర్శకాలు ఏంటంటే మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. ప్రతి యాజమాన్యం నుంచి మూడో వంతు పాఠశాలలను ఎపి సమగ్ర శిక్ష సొసైటీ డైరెక్టర్‌ ఎంపిక చేస్తారు. పాఠశాలల్లో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్‌, పాఠశాలకు పెయింటింగ్‌, చిన్నాపెద్ద మరమ్మతులు, గ్రీన్‌చాక్‌ బోర్డులు,ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మించి ప్రమాణాలను మెరుగుపరుస్తారు.

ఎపి సమగ్రశిక్ష సొసైటీ ఎపిఈడబ్ల్యుయుఐడిసి,పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌, గిరిజన సంక్షేమశాఖల ఇంజి నీరింగ్‌ విభాగాలు ఈ పథకం అమలుకు ఏజెన్సీలుగా పని చేస్తాయి. పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్య వేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, కమిషనర్‌ కన్వీనర్‌గా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, డిఇఒ కన్వీనర్‌గా రెండు కమిటీలు ఏర్పా టవ్ఞతాయి. ఇంప్లిమెంటింగ్‌ ఎజెన్సీలతో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల ద్వారా జిల్లా కలెక్టర్‌ పాఠశాల, పనులవారీగా సవివర నివేది కలు తయారు చేయించుకోవాలి. పాఠశాల ప్రాంగణాలు అందమైన వాతావరణంతో పిల్లలు ఎక్కువ సమయం అక్కడ గడిపేలా తయారు చేయాలి. కొత్త నిర్మాణాలు 75 సంవత్స రాలపాటు ఉండేలా చూడాలి.

సవివర నివేదికలు తయారు చేయడానికి ముందు అందుకు పేరెంట్‌ కమిటీల తీర్మానం తీసుకోవాలి. గ్రీన్‌ బిల్డింగ్‌ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేలా అంచనాలు ఉండాలి. దివ్యాంగ విద్యార్థులు సైతం స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలి. స్వాతంత్య్రానికి ముందు కట్టిన కొన్ని పాఠశాలల పురావస్తు ప్రాధాన్యం పోకుండా చూడాలి. వాటి మరమ్మతులు కూడా అదే సంప్రదాయ రీతుల్లో ఉండేలా చూడాలి. ప్రహరీ గోడల అంచనాలను ఉపాధిహామీ పథకంకింద తీసుకోవాలి. పేరెంట్స్‌ కమిటీలు ఈ పనిని పర్యవేక్షిస్తాయి.

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఈ పథకం అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించి అన్ని విభాగాలను సమన్వయం చేస్తారు. పథకం అమలుకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలులో పేరెంట్స్‌ కమిటీ, ప్రధా నోపాధ్యాయులు కలిసిపూర్తిగా సమయం కేటాయించి పని చేయాల్సిన అవసరంఉంది.అయితే మొదటి విడతలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం పాఠశాలల్లో అమలవడం వల్ల ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ బోధనా సమ యాన్ని ఇతర పనుల కోసం కేటాయించడం వల్ల విద్యార్థులకు బోధించేసమయం తగ్గుతుంది.

ఇప్పటికే అమ్మఒడి అమలులో డేటా సేకరణ,అప్లోడ్‌ అన్నీ పనులు ఉపాధ్యాయులే చేయడం, మనబడి నాడు నేడు కమిటీ ఏర్పాటుచేయడం, దానికి సం బంధించిన బ్యాంకు ఖాతాలు తెరవడం,పేరెంట్స్‌ కమిటీ సభ్యులకు అవగాహన పరచడం వీటివల్ల గత రెండు నెలలుగా ఉపాధ్యాయులపై పని ఒత్తిడి అధికమయినది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయడం వల్ల అధికారులపై పని ఒత్తిడి ఉంది.అందువల్ల మన బడి నాడు నేడు అమలులో ఉపాధ్యాయులు కీలకంగా మారడం వల్ల తమ బోధనా సమయాన్ని వేరే పనులకు ఉపయోగించడం వల్ల విద్యార్థుల చదువ్ఞపై ఎంతోకొంత ప్రభావం చూపుతుంది.

విద్యార్థుల చదువ్ఞ కుంటుపడుతుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభు త్వం చూస్తే బావ్ఞంటుంది. ముఖ్యంగా ప్రాథమికపాఠశాలల్లో హెచ్‌.యం. పోస్టు ఉండదు. ఉపాధ్యా యులే ప్రధానోపాధ్యాయుని బాధ్యతలు అదనంగా నిర్వహి స్తారు. వీటికితోడు అమ్మ ఒడి, మన బడి నాడునేడు లాంటి పథకాల అమలులో అదనపు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ప్రాథమిక పాఠ శాలల్లో ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరు చేసినట్లయితే రాబోవ్ఞ కాలంలో అమ్మఒడి, మన బడి నాడునేడు,ఇంగ్లీషు మీడియంలో విద్య ఇలాంటి పథకాలు విజయవంతం అయ్యే అవకాశంఉంది.

రాబోవ్ఞ విద్యాసంవ త్సరం ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రాథమి కపాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతోనిమిత్తం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుని లేదా సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియ మించాలి. ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలల్లో తరగతికి ఓ ఉపా ధ్యాయునితోపాటు, ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణకు కరస్పాండెంట్‌ ఉండటం వల్ల ఆయా స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం విజయవంతంగా నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వప్రాథమిక పాఠశాలలు అధికభాగం ఒకరు, లేదా ఇద్దరు ఉపాధ్యాయు లతో నడుస్తున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల్లో మౌలికసదుపాయాలు కల్పించినప్పటికీ అమ్మఒడి, నాడు,నేడు,ఆంగ్లమీడియంలో విద్య ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ తరగతికో ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలకి ప్రధానో పాధ్యాయులు లేకుండా గుణాత్మక విద్య ప్రాథమిక స్థాయిలో సాధ్యంకాదు. ప్రజలు కూడా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ తరగతికి ఓ ఉపాధ్యాయుడు లేకుంటే తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్చేందుకు సిద్ధంగాలేరు.

ప్రస్తుత ప్రభుత్వ పథకాలు, ఆకాం క్షలు అమలు కు అనుగుణంగా పాఠశాలల్లోఉపాధ్యాయ పోస్టు లను పెంచే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. మంజూరు చేయాలి,గుణాత్మక విద్యను అందించాలి.ప్రభుత్వ పాఠశాలల్లో చదువ్ఞతున్న విద్యార్థులు అందరూ దాదాపు నిరుపేదల కుటుంబాలకు చెందిన వారు. వారి తల్లిదండ్రులు మనబడి నాడు,నేడుపథకం అమలు నిమిత్తం అనేకపర్యాయాలు కమిటీ తీర్మానాలు,సమావేశాల నిమిత్తం రావాల్సివస్తోంది. అందువల్ల వారి పనులు మానుకొని మరీ రావడంవల్ల ఉపాధి పోగొట్టుకో వాల్సివస్తోంది.

ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్‌ అధి కారులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, సిఆర్పి వెల్ఫేర్‌అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ వీరందరూ కలిసి పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు,అంచనా వ్యయం సిద్ధంచేశారు.ప్రభుత్వం దాదాపు పన్నెండు వేలకోట్ల రూపాయలను ఈ పథకం కింద ఖర్చు చేసి పాఠశాలలను అభివృద్ధి చేయాలని చూడటం శుభ పరిణామమే కానీ ఈ భారీ కార్యక్రమం కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టకుండా విద్యార్థుల పేరెంట్స్‌కమిటీ, పాఠశాల ప్రధానో పాధ్యాయులు,ఇంజినీరింగ్‌ అధికారులపైన ఉంచడం ఎంత వరకు విజయవంతం అవ్ఞతుందోనని నిపుణులు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించడం, నిర్మా ణాలు,పనులు చేపట్టడంలో ఎటువంటి అనుభవంలేని పేరెంట్స్‌ కమిటీకి అప్పచెప్పడంవల్ల పనులు సకాలంలో పూర్తవ్ఞతాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవ్ఞతుంటే, ప్రభుత్వం మాత్రం నిధులుసక్రమంగా వినియోగించబడుతా యని పాఠశాలల్లో తమ పిల్లలుచదువ్ఞతున్నారు కాబట్టి పేరెంట్స్‌కమిటీలు నిధులు వినియోగంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావ్ఞలేకుండా ఉంటుందని చెబుతోంది.

  • ఆత్మకూరు భారతి

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/