గ్రూప్ రాజకీయాలు ఇష్టం లేదు: పువ్వాడ అజయ్

అభివృద్ధి మంత్రంతో తాము వచ్చే ఎన్నికలకు వెళ్తామన్న మంత్రి

minister-puvvada

హైదరాబాద్‌ః కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. తమ బలం కెసిఆరే అన్నారు. తనకు గ్రూప్ రాజకీయాలు ఇష్టం లేదన్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామన్నారు. అభివృద్ధి మంత్రంతో తాము రానున్న ఎన్నికలకు వెళ్తామన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బిఆర్ఎస్ ఒకటే స్థానం పొందిందని, ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మెజార్టీ స్థానాలను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీని తన చేతుల మీదుగా విలీనం చేయడం గొప్ప వరమన్నారు.