మరోసారి జగనన్న విద్యాదీవెన వాయిదా

CM Jagan

అమరావతిః ఏపి ప్రభుత్వం ఈరోజు ప్రారంభించాల్సిన విద్యాదీవెన పథకం మరోమారు వాయిదా పడింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ. 700 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది.

సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28నే ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ తర్వాత దానిని మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా, ఇంకోసారి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటూ జిల్లాలకు ప్రభుత్వం సమాచారం పంపింది. అయితే, మళ్లీ ఎప్పుడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.