ప్రాంతాలవారీగా పుష్ప సక్సెస్ మీట్లు..రేపు ఎక్కడంటే..

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆర్య , ఆర్య 2 తర్వాత సుక్కు – బన్నీ – దేవి శ్రీ ల కలయికలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరుపుతూ అభిమానుల్లో ఉత్సహం నింపుతుంది. ఇప్పటికే తిరుపతి లో సక్సెస్ మీట్ ఏర్పటు చేయగా..నిన్నచెన్నైలో సక్సెస్ పార్టీ చేసారు. ఇక రేపు సక్సెస్ పార్టీని కాకినాడలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. సక్సెస్ పార్టీలు ఈ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయనే అంటున్నారు.

ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇప్పటికే పుష్ప ది రైజ్ ను గతవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పాన్ ఇండియా మూవీగా విడుదల పుష్ప సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్నీ భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలన రెండు రోజుల్లో మూడు రోజుల్లోనే 170 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

ఇక హిందీలోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ కు అక్కడ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో అక్కడ కూడా పుష్ప సినిమాకు భారీ ప్రమోషన్స్ జరిగాయి. అక్కడ పుష్ప సినిమా ఐదు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ దాదాపు 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని తెలుస్తుంది. 30నుంచి35 కోట్ల వరకూ గ్రాస్‌ను రాబట్టవచ్చని చెబుతున్నారు. ఇక ఇటీవలే యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా పుష్ప సినిమా చూడటానికి ఆతృతగా ఉన్న అంటూ చెప్పడంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.