జగన్ సర్కార్ ఫై హీరో నాని విమర్శలు

చిత్రసీమ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల చిత్రసీమ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్స్ ధరలను అమాంతం తగ్గించడం పట్ల నిర్మాతలు , హీరోలు,, ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ టికెట్స్ విషయంలో పలువురు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేయగా..తాజాగా హీరో నాని సైతం జగన్ సర్కర్ తీరు ఫై విమర్శలు చేసారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందంటూ శ్యామ్ సింగ్ రాయ్ ప్రెస్ మీట్ లో నాని అన్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడిన కూడా వివాదం అవుతుందన్నారు నాని. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారు. టూర్ కు తీసుకెళ్లే పిల్లల నుంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే ఒకరిని నువ్వు ఇవ్వలేవంటే అవమానించడమే అన్నారు నాని. నా పేరు ముందు నేచురల్ స్టార్ తీసేద్దామనుకుంటున్నా అన్నారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే మా లక్ష్యమన్నారు. మా లెక్కలు తర్వాత చూసుకుందామన్నారు.

అంతకు ముందు నటుడు బ్రహ్మాజీ సైతం తన ట్విట్టర్ లో “వైఎస్ జగన్ సార్… అందరికీ వరాలు ఇస్తున్నారు… పాపం థియేటర్ ఓనర్స్ కి, సినిమా వాళ్ళకి హెల్ప్ చేయండి… ఇట్లు మీ నాన్న గారి అభిమాని” అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తెలంగాణ థియేటర్ పార్కింగ్ ఫీజు, ఆంధ్రాలో ఉన్న టికెట్ రేట్లకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా ఈ నటుడు జత చేశారు. ప్రస్తుతం బ్రహ్మాజీ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సాయిపల్లవి, కృతిశెట్టి, నాని జంటగా నటించారు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డబుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుందో అని అంత ఎదురుచూస్తున్నారు.