ట్రైలర్ కు ముందే అభిమానుల్లో పూనకాలు తెప్పించిన పుష్పరాజ్

అఖండ తో చిత్రసీమలో అసలైన సినీ పండగ మొదలైంది. నిన్న ఈ చిత్రం విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు..కలెక్షన్లు కూడా రికార్డ్స్ బ్రేక్ చేసాయి. ఇక డిసెంబర్ 17 న అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న ట్రైలర్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. ‘పుష్ప’ మాస్ ఫెస్టివల్ మరో మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుందనగా.. తాజాగా ట్రైలర్ టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. దట్టమైన అడవులను చూపించడంతో ప్రారంభమైన ఈ వీడియోలో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటికీ భాగం కల్పించారు. ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఊర మాస్ అవతారాన్ని చూడొచ్చు. బైక్ ఛేజింగ్ సీన్ – జైల్లో బన్నీ ని బంధించి చిత్రహింసలు పెట్టడం – యాక్షన్ సన్నివేశాలు వంటివి చూపించి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ప్రోమో నే ఈ రేంజ్ లో ఉంటె ట్రయిలర్ ఇంకేలా ఉంటుందో అని అంచనాలు పెంచేసుకుంటున్నారు.

YouTube video