రేపు ఉదయం భీమ్లా నాయక్ నుండి ‘అడవితల్లి మాట’ సాంగ్ రిలీజ్

రేపు ఉదయం భీమ్లా నాయక్ నుండి 'అడవితల్లి మాట' సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో వస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. ప్రతి రోజు ఏదొక అప్డేట్ ఇస్తూ సినిమా ఫై మరింత అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..రేపు (డిసెంబర్ 04) ఉదయం10 గంట‌ల 08 నిమిషాల‌కు ‘అడవి త‌ల్లి మాట‌…’ అంటూ సాగే నాలుగో లిరికల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. వాస్తవానికి డిసెంబర్ 01 నే ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సిరివెన్నెల అకాల మరణంతో వాయిదా వేశారు.

‘భీమ్లా నాయక్’ సారాంశం ఏంటో ‘అడవి తల్లి మాట’ తెలియజేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ – రానా లకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని వదిలారు. ఇన్నాళ్లూ పోస్టర్లు టీజర్లలో ఇద్దరినీ విడివిడిగా చూపించిన చిత్ర బృందం.. ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ల యాటిట్యూడ్ ని చూపించారు. ఇందులో రానా ఇంటెన్స్ గా చూస్తూ ఉండగా.. రానా వైపు పవన్ కోపంగా చూస్తూ నిలబడ్డారు.

‘అడవితల్లి మాట’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.