పుష్ప డిలేటెడ్ సీన్ ను విడుదల చేసిన మేకర్స్..

సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘ ‘పుష్ప : ది రైజ్’ ‘ చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో బన్నీ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. అయినప్పటికీ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను ఎంత తగ్గించకుండా సినిమాకు ఇంకా క్రేజ్ తీసుకొనే వస్తున్నారు. తాజాగా చిత్రంలోని డిలేటెడ్ సీన్ ను విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ వీడియోలో ‘పుష్ప’కు అప్పు ఇచ్చిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి నానా గొడవా చేస్తున్నాడు. అంతేకాదు ‘పుష్ప’రాజ్ మిల్లులో పని మానేశాడన్న నిజాన్ని కూడా వాళ్ళ అమ్మకు చెప్పేశాడు. ఏమాత్రం బాధ్యత లేని యువకుడిగా కన్పించిన ‘పుష్ప’రాజ్ వాళ్ళ గేదెను అమ్మేసి ఆ అప్పు తీర్చేశాడు. అయితే అప్పు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నానా రచ్చ చేసి ‘పుష్ప’ కుటుంబం అప్పు తీసుకున్నట్టుగా అందరికీ తెలిసేలా చేశాడుగా… మరి అప్పు తీర్చేసినట్టు తెలిసేదెలా… ఇలా గుట్టుగా అప్పు తీర్చేస్తే ‘పుష్ప’రాజ్ ఎలా అవుతాడు. అందుకే హీరోయిజంను హైలెట్ చేసే విధంగా ఉన్న ఈ సీన్ లో తాను అప్పును తీర్చేసినట్టు ఇంతకు ముందు గొడవ చేసిన వ్యక్తితోనే తన స్టయిల్ లో చెప్పించడం ఆకట్టుకుంటోంది.

ఈ సీన్ ను చూసిన అభిమానులు ఈ సీన్ ను అనవసరంగా తీసేసారు. చిత్రంలో ఉంచితే బాగుండని కామెంట్స్ వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి నుండి పార్ట్ 2 సెట్స్ పైకి రాబోతుంది. కేవలం 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనీ సుకుమార్ ఫిక్స్ అయ్యాడట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే.. మే నెల నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది.

YouTube video