మరోసారి అభిమానులకు ఆర్ధిక సాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రీసెంట్ గా జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృష్ణం రాజు కటౌట్ నుండి అభిమానులు కిందపడి గాయపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ ..గాయపడి హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న అభిమానులకు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మరోసారి మా ప్రభాస్ మనసున్న నిజమైన మారాజు అంటూ సంబరపడుతున్నారు. ఆయన సినిమా ల తరహాలోనే ఆయన మనసు కూడా చాలా భారీగా ఉందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. తన చుట్టు ఉన్న వారిని ఎప్పుడు సంతోషంగా ఉంచేందుకు గాను ఆయన ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటాడని అంటారు. తన జిమ్ ట్రైనర్ కు ఏకంగా కోటి రూపాయల విలువైన కారు ను బహుమానంగా ఇచ్చిన ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో సందేహం లేదు.

ఇక రాధే శ్యామ్ మూవీ విషయానికి వస్తే… ప్రభాస్ – పూజా హగ్దే కలయికలో రాధే శ్యామ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా … ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. జనవరి 14 న ఈ మూవీ పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉన్నారు. ఈ మూవీ తో పాటు ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసాడు. సలార్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే సగం వరకు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే ఇటీవలే మొదటి షెడ్యూల్ ను ముగించారు. ఇక సందీప్ వంగ దర్శకత్వంలో సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కించే అవకాశం ఉంది.