జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. పుల్వామాలోని మిత్రిగామ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని పోలీసులు మట్టుబెట్టారు. మిత్రిగామ్‌ ప్రాంతంలో బుధవారం పొద్దుపోయాక భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, అంతకు ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మార్చి-ఏప్రిల్‌ మధ్య ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులపై దాడులకు పాల్పడిన వరుస ఘటనల్లో పాల్గొన్నారని ఐజీపీ కశ్మీర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మృతులు ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్‌గా గుర్తించగా.. అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు ఏకే 47 రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ ఉగ్రవాది సహా ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, బలగాలు సంయుక్తంగా కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. అయితే, పౌరుల తరలింపు కారణంతో ఆపరేషన్‌ను మధ్యలో నిలిపివేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/