నితీష్‌ కుమార్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారుః ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌

“Public Will Teach Him A Lesson”: Sharad Pawar On Nitish Kumar’s Switch

ముంబయిః ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో తనకు తెలియదని చెప్పారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో నితీశ్‌ ఒకరు. అయితే అకస్మాత్తుగా ఏం జరిగిందే నాకు తెలియదు. కానీ భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాటం చెబుతారు అని వ్యాఖ్యానించారు. ఇంత స్వల్ప కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇంతకుముందెప్పుడూ తాను చూడలేదని పేర్కొన్నారు.

బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటినీ పాట్నాకు పిలిచినట్లు తనకు గుర్తుందని చెప్పారు. అయితే బిజెపి వ్యతిరేక పోరాటాన్ని వదిలేసేంతగా గత 10-15 రోజుల్లో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఉన్నట్లుండి ఆయన కాషాయ పార్టీతో చేతులు కలిపారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. జేడీయూ నేత, జార్ఖండ్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తన పదవికి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో కూడిన మహాగట్‌భందన్‌ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన.. ఎన్డీయేలో చేరారు. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.