యూపీ కాంగ్రెస్‌ నేతలతో ప్రియాంక గాంధీ సమీక్ష

యూపీలో పోలీసుల కాల్చివేత ఘటన నేపథ్యంలో సమీక్ష

యూపీ కాంగ్రెస్‌ నేతలతో ప్రియాంక గాంధీ సమీక్ష
Priyanka Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ శనివారం యూపీ కాంగ్రెస్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రౌడీలు 8 మంది పోలీసులను కాల్చిచంపిన ఘటన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రియాంక యూపీ కాంగ్రెస్ నాయకులతో సమీక్షించారు. రౌడీల కాల్పుల్లో మరణించిన పోలీసులకు ఆత్మశాంతి చేకూరేలా కాంగ్రెస్ కార్యకర్తుల తమ ఇళ్ల ముందు కొవ్వొత్తులు వెలిగించాలని ప్రియాంకా కోరారు. ప్రియాంకా గాంధీ సీఎల్పీ నాయకుడు, పీసీసీ అధ్యక్షుడు, ఇతర నేతలతో మాట్లాడారు. యూపీలో రౌడీల ఆదిపత్యం సాగుతుందని, జంగిల్ రాజ్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమించాలని ప్రియాంకాగాంధీ కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/