తెలుగు లో తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంకాగాంధీ

తెలుగు లో తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ. ట్వీట్ తో పాటు 1978లో తన నాయనమ్మ ఇందిరాగాంధీ వరంగల్ లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారని తెలియజేస్తూ ఆ ఫొటోను కూడా జత చేశారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కావడంతో ఆమె తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ శ్రేణులు ఆనందాన్ని నింపింది.

ఇక బతుకమ్మ విశేషానికి వస్తే..తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి, విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుంది. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.