పీసీ: సరోగసీలో తొలి బిడ్డకు మమ్మీ
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా శుక్రవారం రాత్రి భర్త నిక్ జోనాస్ తో కలిసి సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించామని వెల్లడించారు. పీసీ తన కుటుంబంపై దృష్టి పెడుతున్నానని.. ఈ ప్రత్యేక సమయంలో గోప్యత కావాలని కోరారు. ప్రియాంక – నిక్ లకు ఇది మొదటి సంతానం. వారు 2018లో వివాహం చేసుకున్నారు. నిక్ ను ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను పంచుకుంటూ ప్రియాంక రాశారు.`మేము సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించామని ధృవీకరించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి కేంద్రీకరిస్తున్నందున మేము గౌరవంగా గోప్యత కోసం అడుగుతాము. చాలా ధన్యవాదాలు“ అని అన్నారు. నిక్ జోనాస్ కూడా తన సోషల్ మీడియా పేజీలో అదే పోస్ట్ ను పంచుకున్నాడు.. ఇన్నాళ్ల సైలెన్స్ ని పీసీ-నిక్ జంట బ్రేక్ చేసింది.
జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/