నడిరోడ్డు పై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం

రామచంద్రాపురంలో ఘటన…భయంతో బస్సు దిగిన ప్రయాణికులు

travel-bus-burned
travel bus burnt

హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు ఉదయం ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు నడిరోడ్డుపై దగ్ధమైంది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందికి దిగిన కాసేపటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. బస్సులో ఉన్న ప్రయాణికు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా రామచంద్రాపురం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/