కోవిడ్ టీకా వేయించుకున్నరాష్ట్రపతి
president-ram-nath-kovind-receives-first-dose-of-covid19-vaccine
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్‌లో కోవిడ్ తొలి డోసు టీకాను వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 60 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. 45 ఏళ్లు దాటి.. వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత టీకాలను ఇస్తున్నారు. ప్రధాని మోడీ తో పాటు కొందరు కేంద్ర మంత్రులు ఇప్పటికే కోవిడ్ టీకాను తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలు సీఎంలు, మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకోవాలనుకునేవారు.. తొలుత కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/