త్వరలో వైఎస్ఆర్సిపిలోకి గంటా శ్రీనివాసరావు
వైఎస్ఆర్సిపిలో చేరిన గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్
tdp-leader-kashi-vishwanath-join-in-ysrcp
అమరావతి: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు, టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ ఈ రోజు విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురి సమక్షంలో వైఎస్ఆర్సిపిలో చేరారు. ఆయనను కండువా కప్పి పార్టీలోకి విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతోన్న సీఎం వైఎస్ జగన్ పాలన చూసే చాలా మంది వైఎస్ఆర్సిపిలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు తమకు కొన్ని ప్రతిపాదనలు పంపారని ఆయన చెప్పారు.
వైఎస్ జగన్ ఆమోదం తర్వాత గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపిలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, వైఎస్ఆర్సిపిలో గంటా శ్రీనివాసరావు చేరతారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/