అధ్యక్షుడు రాజపక్స రాజీనామా ఎందుకు చేయాలి? : శ్రీలంక మంత్రి

ప్రతిపక్ష నేతలు దొంగలన్న మంత్రి జాన్ స్టన్ ఫెర్నాండో

కొలంబో : శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వ విప్, జాతీయ రహదారుల మంత్రి జాన్ స్టన్ ఫెర్నాండో మాట్లాడుతూ.. అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని అన్నారు. దేశంలో కొనసాగుతున్న నిరసనలు ప్రతిపక్షాల కుట్ర అని దుయ్యబట్టారు. దేశంలో నెలకొన్న పరిస్థితిని ఎదుర్కొంటామని చెప్పారు. 69 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధ్యక్షుడు రాజీనామా చేయరని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు దొంగలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/