ప్రమాదానికి గురైన హెల్త్ మినిస్టర్ కార్

ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్​ సింగ్ రావత్ ప్రమాదానికి గురయ్యారు. ఈయన ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురి కావడం తో రావత్​కు స్వల్ప గాయాలయ్యాయి. పౌరిలోని థాలిసైన్‌ పట్ట్టణం నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈఘటనలో మంత్రికి స్వల్పగాయలవ్వగా, ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు బోల్తా పడగా, మరొకటి దాని పక్కనే ఆగి ఉన్నట్లు ఘటనా స్థలంలొ తీసిన ఫొటోలో కన్పిస్తోంది. రావత్ ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నారని,ఆయనను ట్రీట్మెంట్ కోసం పాబో హాస్పిటల్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.