పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కొడుకు ప్రభాకర్ రావు

President Droupadi Murmu Presents Bharat Ratna Award To Former PM PV Naras

న్యూఢిల్లీః పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటిని ప్రదానంచేశారు. పీవీ తరఫున ఆయన తనయుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈసారి భారతరత్న ఐదుగురికి ఇచ్చారు. కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్నను స్వీకరించారు. ఈ నలుగురికి మరణానంతరం అవార్డు లభించడంతో వారి వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు.

కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన తనయుడు రామ్‌నాథ్, చరణ్ సింగ్ తరఫున మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరఫున కూతురు నిత్యారావు అవార్డులను స్వీకరించారు. రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ అగ్రనేత అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు.