కోడి పందేల్లో చింత‌మ‌నేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాకర్ కు పఠాన్ చెరువు పోలీసులు షాక్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా పఠాన్ చెరువు శివారులో కోడిపందేలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న పఠాన్ చెరువు పోలీసులు..బుధువారం రాత్రి దాడి చేసారు. 21 మందిని అరెస్ట్ చేసి , పలు వాహనాలను , ఫోన్లను , అలాగే లక్షల్లో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కాగా దాడుల సమయంలో అక్కడే ఉన్న చింతమనేని పోలీసులను చూసి పరారైనట్లు వార్తలు బయటకు వచ్చాయి. చింతమనేని మాత్రం కోడి పందేలతో తనకెలాంటి సంబంధం లేదని.. ఇదంతా ప్రత్యర్థుల నీచపు ప్రచారమేనని సోషల్ మీడియా లో స్పందించారు.

పోలీసులు, మీడియాపై చింతమనేని చిందులు వేశారు. ఈ క్రమంలో కోడిపందాల శిబిరం వద్ద చింతమనేని ఉన్నాడనే వీడియోను పోలీసులు విడుదల చేసారు. ఈ వీడియోలో కోడి పందేలు నిర్వ‌హిస్తున్న ప్రాంతంపై పోలీసులు దాడి చేసిన స‌మ‌యంలో అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న చింత‌మ‌నేని దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. కోడిపందాల శిబిరం నుంచి చింతమనేని పారిపోతున్న వీడియో వైరల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, పోలీసులు.. కోడి పందాల కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడిపందాల బెట్టింగ్‌ కేసులో చింతమనేనిని ఏ1గా నిర్ధారించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 21 మంది బెట్టింగ్‌ రాయుళ్లను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా చింతమనేని ఇది నువ్వు కదా..అని ప్రశ్నింస్తున్నారు.