మోహన్ బాబు అరగంట పాటు అమ్మనా బూతులు తిట్టాడు – బెనర్జీ

రెండేళ్లు విష్ణు బాగా పనిచేయాలి
పోలింగ్ రోజు మోహన్ బాబు అమ్మనా బూతులు తిట్టారని బెనర్జీ కన్నీరు పెట్టుకున్నారు
బెనర్జీ , తనీష్ ని మోహన్ బాబు కొట్టారు
ఎన్నికల్లో రౌడీ యిజం జరిగింది
క్రాస్ ఓటింగ్ జరిగింది
రాత్రి రాత్రికే ఫలితాలు మారాయి
మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని అన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి.. ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.