పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పవన్ హీరోయిన్..

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పవన్ హీరోయిన్..

పవన్ కళ్యాణ్ సరసన బంగారం చిత్రంలో జోడి కట్టిన మీరా చోప్రా ..పోలీస్ మెట్లు ఎక్కింది. మీరాచోప్రా తాజాగా ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఆ ఇంటి ఇంటీరియల్ వర్క్ కోసం రాజేందర్ అనే వ్యక్తి తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం రూ. 17 లక్షలకు గాను అతడి తో ఒప్పందం కుదుర్చుకోగా..రూ. 8 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చి..షూటింగ్ నిమిత్తం వెళ్లింది. షూటింగ్ ముంగించుకొని వచ్చేసరికి నాణ్యత లేని మెటీరియల్‌ తో ఇల్లు డిజైన్‌ చేశాడని గ్రహించి.. నిలదీయగా.. తన ఇంట్లో నుంచి తననే బయటికి గెంటేశాడని పిర్యాదు లో పేర్కొంది. మీరా చోప్రా నుండి పిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

పవన్‌ కళ్యాణ్‌ హీరో గా 2006 సంవత్సరం లో వచ్చిన బంగారం సినిమా లో నటించి… తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా చోప్రా. బంగారం సినిమా తర్వాత… వాన, మారో మరియు గ్రీకు వీరుడు లాంటి సినిమా ల్లో నటించింది మీరా చోప్రా. అయితే.. తెలుగు నటించిన ఏ సినిమా స్టార్‌ డం రాకపోవడంతో బాలీవుడ్‌ లోనే సెటిల్‌ అయ్యింది.