ద‌ళిత‌బంధు ప‌థ‌కం సరికొత్త ప్ర‌యోగం: ప్ర‌కాశ్ అంబేద్క‌ర్

prakash-ambedkar-praises-on-dalit-bandhu-scheme-in-telangana

జ‌మ్మికుంట‌: హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌మ్మికుంట‌లో ద‌ళిత‌బంధు యూనిట్ల‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌థ‌కం ల‌బ్దిదారుల‌తో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు ప‌థ‌కం దేశానికే ఆద‌ర్శం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ తెలిపారు.

అనంత‌రం ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ మీడియాతో మాట్లాడారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కం సరికొత్త ప్ర‌యోగం అని పేర్కొన్నారు. ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇలాంటి ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాలు కూడా అమ‌లు చేస్తే బాగుంటుంద‌న్నారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తే మ‌రింత మందికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్నారు. చ‌దువుతో పాటు ఉపాధి క‌ల్పిస్తేనే ద‌ళితుల జీవితాలు మెరుగువుతాయ‌న్నారు. 70 ఏండ్లుగా ద‌ళితుల జీవ‌నం మెరుగుప‌డ‌క‌పోవ‌డం బాధాక‌రం అని పేర్కొన్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశం ఉంది. ఈ పథకం గురించి మరిన్ని సూచనలు చేస్తా. దారిద్ర రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలని ముఖ్యమంత్రిని కోరుతాను అని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ చెప్పారు.