ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

ఢిల్లీ ఎన్నికలు గుణపాఠం కావాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

దురహంకారంతో పాలనను సాగిస్తున్న నేతలకు ఢిల్లీ ఎన్నికలు గుణపాఠం కావాలి.ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి నలుగు రు ఎంపీలు సందు సందుకి తిరిగినా, డబ్బు గుమ్మరించినా హామీల వర్షం కురిపించినా ఢిల్లీ ఓటరును ఆకట్టుకోలేకపోయా రు. సచ్చీ చెడి కేవలం ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్న గుత్తాధిపత్యానికి ఈ ఎన్నికలు తిరుగులేని తీర్పునిచ్చి కమలనాధుల కళ్లు తెరిపిం చాయి.అసంబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీకి దేశప్రజలు గోరికట్టే పరిస్థితిఏర్పడింది.నవ్యాంధ్రప్రదేశ్‌ యొక్క విభజన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కమలనాథులకు భవిష్యత్తులో అదే పరిస్థితి ఎదురుకానుంది. ప్రధాని, కేంద్రపెద్దలు ఇకనైనా కళ్లు తెరిచి ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటు సాక్షిగా చేసిన విభజన హామీలను అమలు చేసి రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి.

పెట్టుబడులకు అనువైన వాతావరణమెక్కడ?:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు,ప.గో.జిల్ల్లా

రాష్ట్ర పరిశ్రమలశాఖమంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని పదేపదే ఉద్ఘాటిస్తున్నా వాస్తవ పరిస్థితు లుఅందుకు భిన్నంగా ఉన్నట్లు సామాన్యులకు సైతం అవగతం అవ్ఞతున్నది. తాజాగా శ్రీకాకుళం జిల్లా భావనాపాడు ఓడరేవ్ఞ నిర్మాణం ఒప్పందంనుండి అదాని సంస్థ వైదొలగిన వార్త పాల కులపై పెట్టుబడిదారులకు నమ్మకం లేనట్లుగా భావించవలసి వస్తుంది.గతఎనిమిది నెలలుగా ఒక్కొక్కరూ వెళ్లిపోవటమేకానీ, ఒక్కరు కూడా పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చిన దాఖలాలు లేవ్ఞ. ఆ పైన పరిశ్రమలు స్థాపించిన వారుకూడా కొనసాగింపుపై పునరాలోచనలో పడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలలోకూడా వార్తలు చోటుచేసుకుంటున్నాయి.రాష్ట్ర పాల కులు ఇప్పటికైనా తమ ఆలోచనావిధానాలను మార్చుకోవాలి.

సమాధానం లభిస్తుందా?: -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

నిర్భయతర్వాత మితిమీరిపోతున్న అఘాయిత్యాలను గమ నిస్తే మనచట్టాలు ఎంతబలహీనంగా, పేలవంగా పనిచేస్తు న్నాయో స్పష్టం అవ్ఞతోంది. ఆ బలహీనతలనే తమకు బ లంగామార్చుకొని మృగాళ్లుపెచ్చుమీరిపోతున్నారు.నిర్భయ కేసులో దోషులకు పడ్డ ఉరిశిక్షలు అమలుకాకుండా వాయి దాలు పడుతుండడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతు న్నాయి.అసహనం పెరిగిపోతోంది. మృగాళ్లలోనైతే పైశా చికత ముదిరిపోతోంది. చట్టాలను వెంటనే సవరించాలి.

ఇంగ్లీష్‌ మీడియం విజయవంతం కావాలంటే..: -పారేపల్లి సత్యనారాయణ, దేవ్ఞలపల్లి, ప.గో జిల్లా

రాష్ట్రంలో అన్ని ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యా యులకు రాబోయే విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టబోతున్న దృష్ట్యారాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు మీడియం రద్దుచేసి, ఇంగ్లీష్‌ మీడి యం ప్రవేశపెట్టి ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి, పాఠ్యపుస్తకాలు ఆంగ్లంలో ముద్రించినంత మాత్రాన ప్రభుత్వ ఉద్దేశ్యం సఫలీకృతంకాదు.ఎందుకంటే ఎక్కువశాతం ఐదు తర గతులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నపాఠశాలలేఉన్నాయి. ప్రతి తరగతికి ఒక గది, ప్రతిసబ్జెక్ట్‌కు ఖచ్చితంగా ఒక ఉపాధ్యా యుడు తప్పనిసరిగా ఉండాలి. నాడునేడు కార్యక్రమాన్ని వేగవంతంచేసి మౌలికవసతులను ప్రతి పాఠశాలకి అందించగలి గినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరుతుంది.

ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలి: -సి.సాయిప్రతాప్‌, హైదరాబాద్‌

కేంద్రప్రభుత్వం రాజకీయ అవసరాల కారణంగా నిధుల కేటా యింపు, ప్రాజెక్టుల ఆమోదం వంటి అంశాలలో సవతి తల్లి ప్రేమ కనబరచే వైఖరి పట్ల దేశంలో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవ్ఞతున్నాయి. ముఖ్యంగా గత అయిదేళ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాలపట్ల తీవ్ర నిర్లక్ష్యవైఖరిని కేంద్రప్రభుత్వం కనబరుస్తోంద నేది కాదనలేని సత్యం. తెలుగు రాష్ట్రాల్లో 2014లో అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, వివిధమార్గాల విస్తీర్ణం, కొన్ని ముఖ్య జాతీయ రహ దారులలో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా దిద్దుబాటు చర్య లు, రహదారుల ఆధునీకరణ వంటి అంశాలలో పెండింగులో ఉన్న వాటిని కూడా పట్టించుకోవడం లేదు. కేంద్రం వెంటనే స్పందించి నిధుల కేటాయింపులు జరపాలి.

పరీక్షల విధుల నుండి మినహాయింపు: -ఎస్‌.శంకరరావు, శ్రీకాకుళం

రాష్ట్రంలో త్వరలోజరగబోవ్ఞ పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఎన్నికల విధుల నుండి మార్చి 2020లో జరగబోవ్ఞ 10వ తరగతి, ఇంటర్మీడియేట్‌ పబ్లిక్‌ పరీక్షల ఇన్విజిలేషన్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు మొదలగు పరీ క్షల విధులఉండి50ఏళ్లు నిండినఉద్యోగులు,ఉపాధ్యాయు లకు మినహాయింపుఇవ్వాలి.50ఏళ్లు దాటిన వారు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురిఅవ్ఞతున్నారు. ముఖ్యంగా మహిళలు మరింత ఒత్తిడికి గురై తీవ్ర ఇబ్బం దులు పడుతున్నందున ఎన్నికల విధుల నుండి, పరీక్షల విధుల నుండి ఉద్యోగ, ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/