సిరియాలో ప్రారంభమైన ప్రపంచ కార్మిక సదస్సు

World Labor Conference
World Labor Conference

డమస్కస్‌ : తాము ఉగ్రవాదంపై జరుపుతున్న యుద్ధం అబద్ధాలపై సత్యం సాగించే పోరాటమేనని సిరియా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు జమాల్‌ అల్‌ ఖాద్రి అన్నారు. కార్మిక సంఘాల ప్రపంచ సమాఖ్య (వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (డబ్ల్యుఎఫ్‌టియు) 27వ సదస్సు డమస్కస్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సదస్సులో ఖాద్రి మాట్లాడుతూ ”మాతృభూమి రక్షణ మొదలు ఫ్రెంచి వలస వాదం నుండి స్వాతంత్య్రం సాధించడం కోసం జరిగిన యుద్ధంతో పాటు ప్రస్తుతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తొమ్మిదేళ్ళుగా సిరియా జరుపుతున్న పోరాటాలను కార్మికులు ముందుండి నడిపిస్తున్నారు” అన్నారు. దురాక్రమణ దారులు దేశాన్ని అన్యాయంగా ముట్టడించి, అక్రమ ఆర్థిక బలవంతపు చర్యలు విధించినప్పటికీ సిరియా కార్మకులు దృఢంగా నిలబడ్డారని, ప్రతిఘటనకు మూలస్తంభంగా నిలిచారని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/