ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

ఇంధన సుస్థిరత, ప్రజలకు పరిశ్రమలకు నిరంతరం నాణ్య మైన విద్యుత్‌ను సరసమైన ధరలకు అందించే సుస్వప్నం సాకరామయ్యేందుకు ఇంధన సామర్థ్య రంగానికి చేయూత నివ్వడం చాలాముఖ్యం.

దేశంలో ప్రథమంగా ఎనర్జీ ఎఫిషీ యన్స్‌ పథకాలను చేపట్టి నాణ్యమైన విద్యుత్‌ను అందించడం లో గుజరాత్‌ ప్రభుత్వం అగ్రస్థానంలో కొనసాగుతుంది.

ఆ రాష్ట్రం సాధించిన అనితర సాధ్యమైన ఫలితాల స్ఫూర్తిగా మన రాష్ట్రం కూడా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.

వివిధ రంగాలలో ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రవేశపెట్టడంతోపాటు కాలుష్యస్థాయి తక్కువగా వ్ఞండే సాంకేతికతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆయా రంగాలలో అనుభవం ఉన్న అంతర్జాతీయ సంస్థల సహాయ సహకారాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.

ఫిరాయింపులకు ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు?: -ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

తెలుగుదేశం,కాంగ్రెస్‌ పార్టీల్లో సీనియర్‌ నాయకులుగా చెలా మణి అయిన వారిలో చాలా మంది ఇప్పుడు ఇతర పార్టీలలో చేరిపోయారు.

వారిలోకొందరు మంత్రులుగాఉన్నారు. గతంలో వీరు రాజశేఖరరెడ్డి,చంద్రబాబు ఫొటోలు పట్టుకుని తిరిగిన వారే.వారి జనాకర్షణతో గెలిచిన వారే అధికారంలో ఉన్నవాళ్లు పదవ్ఞలను అనుభవించి ఇప్పుడు ఇతర పార్టీల పంచన చేరి వారి భజన చేస్తున్నారు.

బాకాలు ఊదుతున్నారు. జనాకర్షణ సొంతంగా గెలిచే సత్తాలేని ఫిరాయింపుదారులు సొంత లాభం కోసం అధికారంలో ఉన్న పార్టీలను ఆశ్రయిస్తున్నారు.

మద్యం దుకాణాలను మూసివేయాలి:-కె.రామకృష్ణ, హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్‌ ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేయడం లేదు.

కరోనాతో సహజీవనం సాగించా లని ప్రకటనలు చేస్తున్నారు. అధికారులు అత్యవసరం కాని వ్యాపార సంస్థల కార్యకలాపాలను కూడా నియంత్రించడం లేదు.

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కనీసం మద్యం దుకాణాలను అయినా మూసివేయడం చాలా అవసరం.

నిజానికి మద్యం దుకాణాల వద్ద ఎటువంటి నిబంధనలను పాటించడం లేదు. అమలు చేయడం కూడా కష్టసాధ్యమే! మద్యం దుకాణాలను మూసేవిధంగా పాలకులు నిర్ణయం తీసుకోవాలి.

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన విధంగా గ్రామస్థాయి నుండి రౌండప్‌ పరీక్షలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు చేపడితేనే రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడి సాధ్యమవుతుంది.

ప్రభుత్వం విస్తృతస్థాయి అవగాహన కల్పించడం వలన కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు పరీక్షల కోసం క్యూకడుతున్నారు.

అయితే తప్పుడు చిరునామాలు ఇస్తున్నవారి సంఖ్య పెరుగుతుండడం తో ఫలితం వచ్చాక రోగి రౌండప్‌ చేయడం సాధ్యంకావడం లేదు.

ఆరోగ్యకేంద్రాలలో జరిగే పరీక్షలపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ లోపించడం వలన తూతూ మంత్రం చందాన పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పరీక్షల వెంటనే ఫలితాలు, రిపోర్టు లు వెలువరించేలా చర్యలు తీసుకోవాలి. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు క్వారంటైన్‌ కేంద్రాలలో సౌకర్యాలను మెరుగుపరచాలి.

క్రీడలను ప్రోత్సహించాలి:-జి. రామకృష్ణ, నల్గొండ

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఒక స్పష్టమైన క్రీడావిధానం ఇప్పటి వరకు అమలులో లేదు.

ప్రభుత్వాలు క్రీడారంగాన్ని విస్మరించడం, క్రీడాసంఘంలో నెలకొని ఉన్న రాజకీయాలు, ఆధిపత్యధోరణి, దీర్ఘకాలిక వ్యూహం మొదలై నవి క్రీడాకారులకు గొడ్డలిపెట్టులా పరిణమిస్తున్నాయి.

ప్రభు త్వం, పత్రికలు మీడియా క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత ఇంకా ఏ క్రీడకు ఇవ్వడం లేదన్నది నిర్వివాదాంశం.

క్రికెట్‌ ఆటగాళ్లను హీరోలుగా చూసే ప్రజలు ఇతర క్రీడలలో అద్భుతమైన ప్రతిభ సాధించే క్రీడాకారులను నామమాత్రంగానైనా పట్టించుకోవడం లేదు.

ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి ఒక స్పష్టమైన క్రీడావిధానాన్ని అమలు చేసి భవిష్యత్తులోనైనా చక్కని ప్రతిభ ఉన్న క్రీడాకారులను దేశానికి అందించే ప్రయత్నం చేయాలి.

కులవృత్తులను ఆదరించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

కులవృత్తులను నమ్ముకొని గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్ని సంవత్సరాలుగా కుల వృత్తులకు ఆదరణ తగ్గుతూవస్తుంది.

పట్టణాల నుంచి ఆన్‌లైన్‌ లో అన్ని వస్తువ్ఞలు గ్రామాలకు రావడం వల్ల గ్రామీణ ప్రాం తంలో తయారు అయిన వస్తువ్ఞలను ఎవరూ కూడా కొనడం లేదు.

కులవృత్తులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/