ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

వర్షాకాలంలో జాగ్రత్త!:-కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

వర్షాకాలంలో మొదలై రకరకాల వ్యాధులు పుట్టుకురావడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యపాలవ్ఞతున్నారు. దీనికితోడు కరోనా మహమ్మారి జతకావడంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు వ్యాపార ధోరణితో ఆలోచిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఏ కొంచెం జలుబు చేసినా,జ్వరం వచ్చినా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు రావడం సహజమే. ఈ సీజన్‌లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూగోరువెచ్చని నీటిని తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలితంగా ప్రజలలో కరోనా వ్యాధి పట్ల ఒక అవగాహన వచ్చింది. కానీ, ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు కరోనా బూచి చూపిస్తూ అధిక మొత్తం ఫీజులు రాబట్టుకుంటున్న వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.

మోడల్‌ స్కూళ్ల స్వయంప్రతిపత్తిని కాపాడాలి: -బి.సురేష్‌,శ్రీకాకుళం

164 మండలాల్లో ఉన్న నాన్‌ రెసిడెన్షియల్‌ మోడల్‌స్కూళ్లను పరిపాలన, ప్లానింగ్‌, విద్యావిషయక అంశాల్లో సారూప్యత పేరుతో ఇతర రెసిడెన్షియల్‌ యాజమాన్యాలు అయిన గురు కులాలు, కస్తూరిబా పాఠశాలలతో కలిసి ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే విద్యాశాఖ అసంబద్ధ ప్రతిపాదనలు వలన విద్యా వ్యవస్థలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

2013లో ప్రారంభమైన మోడల్‌ స్కూళ్లు పూర్తిగా నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు అనిధృవీకరిస్తూ విద్యాశాఖపలు సం దర్భాల్లో స్పస్టత ఇచ్చింది.

ఏడు సంవత్సరాలుగా సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న మోడల్‌ స్కూళ్ల రెగ్యులర్‌ సిబ్బందికి ప్రభుత్వం త్వరలో న్యాయం చేస్తుందని తెల్పినప్ప టికీ విద్యాశాఖ నిర్ణయాలు శాపంగా మారే అవకాశం ఉంది.

అక్రెడిటేషన్లు ఇవ్వండి: -ఎల్‌.ప్రఫుల్లచంద్ర ధర్మవరం, అనంతపురంజిల్లా

ఏటా జర్నలిస్టులకు ప్రభుత్వం సమాచార శాఖ ద్వారా అక్రిడిటేషన్‌ కార్డులను జారీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2021వరకూ మంజూరుచేసింది.

కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం వీటిని మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.దీనివలన మీడియాసోదరులు చాలా ఇబ్బందులు పడుతు న్నారు.

అసలే కరోనాకాలంలో అవస్థలుపడుతున్నారు.ఈ విషయంపై ముఖ్యమంత్రి చొరవతీసుకుని తగినచర్యలు గైకొనాలి.

తప్పెవరిది?:-డా.దన్నాన అప్పలనాయుడు, పార్వతీపురం

ఇన్ని రోజులు మానవజాతి సాధించిన అభివృద్ధి మానవ్ఞన్ని ఈ చిన్న వైరస్‌ నుండి ఎందుకు కాపాడలేకపోతోంది. డబ్ల్యుహెచ్‌ఒ చెప్పిన ప్రకారం కరోనా అనేది సార్స్‌జాతి వైరస్‌. ఈ సార్స్‌ కరోనా వైరస్‌, ముందు వచ్చిన సార్స్‌ వైరస్‌ల కన్నా తక్కువ శక్తికలదైనా ఈ కరోనాకు ఇన్ని లక్షలమంది ఎలాబలైపోతున్నా రు.

ఈ వైరస్‌లుఇప్పుడు పుట్టినవికాదు.కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే ఉన్నాయి. అప్పుడు వైరస్‌లను తట్టుకున్న మానవ్ఞలు ఇప్పుడు ఎందుకు తట్టుకోలేక పిట్టల్లా రాలుతున్నారని గత కొంతకాలం నుంచి జరిగిన మార్పులు గమనిస్తే 5-6 నెలల్లోపండవలసిన ధాన్యాన్నివంగడాల పేరుతో రెండు,మూడు నెలలకు పెరిగేవిధంగా తయారుచేసి ఈ వంగడాలనుండి వచ్చి న ధాన్యాన్ని తింటున్నాం.

కల్తీ కారణంగా ఇమ్యూనిటీ కోల్పో తున్నాం. ఏ చిన్న వ్యాధికి తట్టుకోలేక మరణిస్తున్నాం.

శాంతి కపోతంగా మారిన గాల్వన్‌ లోయ: -సింగంపల్లి శేషసాయి కుమార్‌, రాజంపేట

ఇటీవల కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మనదేశ సైనికుల ను 20 మందిని పొట్టన పెట్టుకుంది. దీనిపై స్పందించిన ప్రధాని దీనిని ఒక ప్రతిష్టాత్మక అంశంగా తీసుకుని యావత్తు ప్రపంచానికి చైనా చేస్తున్న దురాగతాన్ని ఎత్తి చూపుతూ మరొకవైపు విదేశీ, దౌత్య వ్యవహారాలలో తనదైన శైలిలో చైనా దూకుడుకు కళ్లెం వేశారని చెప్పవచ్చు.

జాతీయ భద్రతా సల హాదారుఅజిత్‌దోవల్‌ నిర్వహించిన చర్చల వల్ల చైనా ఆధీనరేఖ నుండి తన బలగాలను దూరంచేయడం శుభపరిణామంగా భావించవచ్చు.

దీనికి సమానంగా మనదేశం కూడా సైనిక బల గాలను వెనక్కితీయడంతో చల్లనిమంచుకొండలగాల్వాన్‌ లోయ ప్రాంతం ఇప్పుడు ఒక పెద్ద శాంతికపోతంలా కనిపిస్తోంది.

‘ప్రైవేటు’ దుర్మార్గం: -బాపట్ల రామపుల్లారావు,, విజయవాడ

ప్రపంచమంతా చైనా కరోనా వ్యాధితో తత్సంబంధిత అనం తర, అనుబంధ పరిణామాల్లో అట్టుడికిపోతోంది. ప్రతి వారికి బతుకు ఒక సమస్యగా మారింది. ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక దినంగడవడం కష్టమైపోయి నానా యాతన, నరకయాతన పడుతున్నారు.

అయినా ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా కొందరు ధనసముపార్జన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆచరిస్తున్నారు.

ఇది ఎంతటి కఠినమైన క్రూరమైన చర్యయో. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యు లు, వసతులు సరిపోకపోవడంతో ప్రైవేట్‌ వైద్యశాలలకు కూడా చికిత్స అనుమతులు ఇచ్చారు.

దానితో అప్పటివరకు మూతపడిన ప్రైవేట్‌ వైద్యశాలలు ఇంక విజృంభించి వసూళ్లు ప్రారంభించాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/