ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజా గళం

Voice of the people
Voice of the people

విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో అన్ని యూనివర్శిటీలు ఫైనల్‌ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్‌ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికే డిగ్రీలు అందచేయాలని కేంద్ర విద్యామండలి నిర్ణయించడం అసంబద్ధంగా ఉంది.ఆగస్టు, సెప్టెంబరు నెలలో వర్షాల కారణంగా కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశంఉందని ప్రపంచఆరోగ్యసంస్థ ఇప్పటికే ప్రకటించింది.

దేశంలో నెలకొన్న తీవ్రపరిస్థితుల దృష్ట్యాఅక్టోబరు- నవంబరు వరకు విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు ప్రస్తుతం లేవ్ఞ. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు తెరిచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం అహేతుకం. ఈ నిర్ణయం లక్షలాది విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడే ప్రమాదం ఉన్నందున వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. గత రెండేళ్లలో సాధిం చిన మార్కులు, ఫైనల్‌ ఇయర్‌లో అసైన్‌మెంట్స్‌, ఇంటర్నెట్‌ పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వాలి.

కరోనా జయించిన వారిని చూపాలి: -సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరింప చేసిన కరోనా వైరస్‌ జనంలో తీవ్ర భయాందోళనలు కలుగచేసింది. దీనికి కారణం అనేకప్రసారమాధ్యమాలు కరోనాసోకిన ప్రజలసంఖ్య, కరోనా తోఎంతమంది చనిపోయారు, చనిపోయిన వారినిఎలా దహనం చేశారు.

దీనివల్ల అందరిలో ఒకరకమైన మానసిక అలజడి మొదలైనది.కానీ ఇకపై అయినా కరోనా నుండి కోలుకున్న వారి మనోగతం, వారు పాటించిన పద్ధతులు, వారి మానసిక స్థితి లాంటివి చెప్పడం, చూపడం వల్ల ఒకవేళ వైరస్‌ సోకినప్పటికీ కూడా ధైర్యం కోల్పోకుండా ఉంటారు.కాబట్టిఅన్ని ప్రసారమాధ్యమాలు, సామాజిక మాధ్య మాలు కరోనాను జయించిన వారి గూర్చి చెప్పాలి.

చేనేత కార్మికులను ఆదుకోండి:-కె.రామకృష్ణ, నల్గొండ

చేనేత కార్మికులకు చేతినిండా పనిలేక, నేసినబట్ట కొనుగోలు లేక కొన్నిదుకాణాలు మూతపడటంవంటి సవాలక్ష కారణాలతో నేతన్నలుమగ్గంగోతిలో గిలగిల్లాడుతున్నారు.అంతంత మాత్రం గా ఉన్న బతుకుల్లో కరోనా మహమ్మారి అవతరించడంతో వారి జీవితం పెనంమీదనుండిపొయ్యిలో పడ్డట్టయింది.

పూట గడవడం గగనమై తిండి లేక పస్తులతో నేస్తం చేస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహార పొట్లాలకై గుట్టుచప్పుడు కాకుండా తీసు కునే దుస్థితిలోఉన్నారు. ఒకప్పుడు మగ్గాల మోతతో అలరారే ఊళ్లకు ఊళ్లూ నిశ్శబ్దంలో నిద్రపోతున్నాయి.

నిధులు కేటాయించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్‌ చట్టంతోపాటు గ్రామపంచాయతీ మెరుగైన రవాణాసదుపాయాలను కల్పించా లన్న సమున్నత లక్ష్యంతో కొన్ని కోట్లతో ప్రతిపాదనను సిద్ధం చేస్తుండడం హర్షణీయం.రాష్ట్రంలో సుమారు వేల కిలోమీటర్ల కుపైగా గ్రామీణ రోడ్లు ఉన్నాయి.

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలుగడిచినా 90శాతంరోడ్లు ఇంకా మట్టిరోడ్లుగా ఉండిపో యాయి. గ్రామీణరోడ్ల అభివృద్ధికోసం ప్రభుత్వంప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా అందిస్తున్న అరకొర నిధులను అసలెందుకూ చాలడంలేదు.

వర్షాలకు మట్టి కొట్టుకు పోయి రోడ్లుగుంతలుపడి ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ప్రాణా పాయపరిస్థితులలోఅంబులెన్సులు, ఇతరవాహనాలు గ్రామాల లోకివచ్చేపరిస్థితి ఎంతమాత్రంలేదు.రెండేళ్లలో మొత్తం గ్రామీణ రోడ్లను బిటిరోడ్లుగామార్చాలన్న పథకంఅమలుచేస్తే తెలంగాణ గ్రామీణభారతం ముఖచిత్రమే పూర్తిగా మారిపోనున్నది.

కనీస వసతులు కల్పించాలి: -సి.శేఖర్‌, మహబూబ్‌నగర్‌

నేడు ఆమోదం తెలిపిన జాతీయ విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చారు. కాకపోతే ఏవిధానమైన విజయం సాధించాలంటే ముఖ్యమైనది కనీస వసతుల కల్పన. ఇప్పుడున్న విధానమైన సరే, కొత్తదైనా సరైన మౌలిక వసతులు ఇవ్వాలి. పాఠశాల వాతావరణం విద్యార్థుల ఎదుగుదలకు దోహదపడేలా ఉండాలి. ముఖ్యంగా పాఠశాల భవనాల నిర్మాణంలో లోపాలు, పైనుండి పెచ్చులూడిపడుతుంటాయి. పిల్లలుప్రమాదాలకు గురవ్ఞతుం టారు. సరైన తరగతి గదులు, ఫర్నీచర్‌, గ్రంథాలయం, దానికి సరిపడేపుస్తకాలు,సైన్స్‌ల్యాబ్స్‌,ఆటస్థలం, మధ్యాహ్నభోజనం, తాగునీటి వలసతి,మరుగుదొడ్లు, ప్రహరీగోడ, బోధనసిబ్బంది, బోధనేతర సిబ్బంది ఇలా అనేక రకాలైన సౌకర్యాలు అవసరం ఉంటాయి. వీటిని ముందు సమకూర్చి ఏ విధానాన్ని ముందు కు తెచ్చినా మంచి ఫలితాలు వస్తాయి.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

పనులు లేక ఆదాయం కొరవడటం, మద్యానికి అలవాటుపడిన ప్రాణులు,ఆంధ్రప్రదేశ్‌లో కిక్కు ఇవ్వని మద్యం, అత్యధిక రేటు ఉండడం వంటి పలు కారణాలతో శరీరాన్ని మత్తెక్కించేందుకు ఏదోఒకటి సేవించాలనే ఆత్రుతతో బ్యాటరీ, నాటుసారా సేవిం చి గతంలో కొన్నిప్రాణాలు అర్థాంతరంగా కాలగర్భంలో కలిసి పోతుండేవి. ఇటీవల శానిటైజర్‌ తాగి అనేకమంది అసువ్ఞలు బాస్తున్నారు.అమలుచేయగలిగితే మద్యనిషేధం విధించి అమాయక ప్రజల ప్రాణాలుబలికాకుండా కాపాడాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/