ఏ రాజకీయ నేత ఇష్టమని చిరంజీవి ని అడిగిన పూరి..

ఆచార్య తో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తో చిరు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో నటించిన డాషింగ్ డైరెక్టర్ పూరి తో చిట్ చాట్ చేసాడు. ఈ చిట్ చాట్ లో చిరంజీవి ని అనేక ప్రశ్నలు అడిగారు. అందులో పొలిటికల్ లీడర్స్ ను గురించి కూడా అడిగారు.

మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? అని పూరి జగన్నాథ్ అడిగారు.ప్రశ్నకు చిరంజీవి ఇబ్బంది పడకుండా ఏ జనరేషన్ నాయకులైనా సరే అని అన్నారు. దీనికి సమాధానం ఇచ్చిన చిరంజీవి.. ఈ జనరేషన్ లో ఇష్టమైన నాయకులు ఎవరంటే తన దగ్గర సమాధానం లేదన్నారు. పాత కాలంలో చాలా మంది గొప్ప నాయకులు ఉన్నారని, పార్టీలకు అతీతంగా వాళ్లంటే తనకు ఇష్టమని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్ పేయి తనకు ఇష్టమైన నాయకులు అని చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజునే జన్మించిన శాస్త్రి ఆయనలానే ఉంటారన్నారు. వాజ్ పేయి నిజమైన రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందన్నారు.