బ‌తుక‌మ్మ పాటను విడుదల చేసిన షర్మిల

బ‌తుక‌మ్మ పాటను విడుదల చేసిన షర్మిల

బతుకమ్మ సందర్బంగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ..బతుకమ్మ పాటను విడుదల చేసింది. ‘నా తమ్ముడు ఏపూరి సోమన్న స్వయంగా రచించి, పాడిన బతుకమ్మ పాటను సోమన్న పుట్టిన రోజు సందర్భంగా, బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. తమ్ముడు ఏపూరి సోమన్నకు జన్మదిన శుభాకాంక్షలు.

అలాగే ఆడపడుచులందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు’ అని ష‌ర్మిల ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకరావాలని షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ‌ నిరుద్యోగుల స‌మ‌స్య‌ల ఫై ఫోకస్ పెట్టిన ఈమె.ప్రతి మంగళవారం నిరాహారదీక్ష చేపడుతూ వస్తుంది. ఈ రోజు ఉమ్మడి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఆమె దీక్ష‌కు దిగనున్నారు.

నా తమ్ముడు Dr.ఏపూరి సోమన్న స్వయంగా రచించి, పాడిన బతుకమ్మ పాటను సోమన్న పుట్టిన రోజు సందర్భంగా మరియు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. తమ్ముడు Dr.ఏపూరి సోమన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆడపడుచులందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.https://t.co/pxyB8CXRUk— YS Sharmila (@realyssharmila) October 12, 2021