ఆదిపురుష్ కోసం ప్రభాస్ రోజుకు మూడు కోట్లు తీసుకుంటున్నాడా..?

ఆదిపురుష్ మూవీ కోసం ప్రభాస్ రోజుకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట..ఇదే ఇప్పుడు చిత్రసీమ లో హాట్ టాపిక్ అవుతుంది. బాహుబలి చిత్రం తో ప్రభాస్ రేంజ్..ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ప్రభాస్ అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రభాస్ కు వీరాభిమానులయ్యారు. ఆ తర్వాత సాహో చిత్రం తో నార్త్ లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. రాధే శ్యామ్ , సలార్ తో పాటు ఆదిపురుష్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ప్రభాస్‌కు బాలీవుడ్ స్టార్స్‌కు ఇవ్వనంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆదిపురుష్‌’ సినిమాకు ప్ర‌భాస్ రోజుల లెక్క‌న కౌంట్ చేసి రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశాడ‌ట‌. ప్ర‌భాస్‌కు సౌత్ పాటు నార్త్ ను కూడా క్రేజ్ ఉండ‌టంతో బిజినెస్ ప‌రంగా సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌ను వ‌సూలు చేసుకోవ‌చ్చున‌ని భావించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌భాస్ అడిగినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి రెడీ అయ్యార‌ట‌.

ప్ర‌భాస్ ఓరోజుకు రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ అడిగారని తెలుస్తుంది. ఆదిపురుష్ మూవీ కోం ప్ర‌భాస్ 50 రోజుల కాల్షీట్స్ కేటాయించాడ‌ట‌. అంటే ఆ లెక్క‌లో రూ.150 కోట్లు రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్నాడ‌న్న‌మాట‌. ఇండియాలో మ‌రే స్టార్‌కు ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ లేదని చెప్పవచ్చు. మరి నిజంగా ప్రభాస్ రోజుకు మూడు కోట్లు తీసుకుంటున్నారా..? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.