శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్..?

ఇటీవల కాలంలో తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు తమిళ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటీకే సూర్య ,కార్తీ , విజయ్ వంటి వారు తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ చేయగా..ఇక ధనుష్ కూడా ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో సార్ అనే మూవీ చేస్తున్నాడు. తెలుగు , తమిళ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ధనుష్ స్కూల్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ధనుష్ మరో తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. గోదావరి , హ్యాపీ డేస్ , ఆనంద్ వంటి కూల్ మూవీస్ తో కూల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ధనుష్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని , కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. అలాగే విరాటపర్వం ఫేమ్ దర్శకుడు వేణు ఉడుగుల తో కూడా ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.