కేసీఆర్ ఫ్యామిలీ కి వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం

ఇప్పటివరకు బిజెపి కి వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలువడం వార్తల్లో నిలువుగా..ఇప్పుడు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్ లు వెలిశాయి. కేసీఆర్ ఫ్యామిలీ కి వ్యతిరేకంగా నగరంలో పోస్టర్లు అంటించారు. మొన్న… బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పోస్టర్లు వేస్తే.. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోస్టర్లు అతికించారు.

ప్రస్తుతం వరుస సంఘటనలు బిఆర్ఎస్ సర్కార్ ను విమర్శల పాలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..ఇప్పటీకే ఈడీ ముందు హాజరైన సంగతి తెలిసందే. ఈ నెల 20 న మరోసారి ఈడీ విచారణ ఎదురుకోబోతున్నారు. ఈ కేసులో కవిత అరెస్ట్ కావడం ఖాయమని బిజెపి నేతలు అంటున్నారు. ఈ కేసులో కవిత ఆరోపణలు ఎదురుకోవడం కేసీఆర్ ను విమర్శలపాలుచేస్తుంటే..తాజాగా TSPSC పేపర్ లీకేజ్ ఘటన ప్రభుత్వాన్ని మరింత విమర్శల పాలుచేస్తుంది. దీనిని ఆసరాగా చేసుకొని ప్రతిపక్ష పార్టీ లు మరింతగా దూకుడు చూపిస్తున్నాయి. అటు విద్యార్థి సంఘాలు , విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.