మహిళా కమిషన్‌ ఎదుట హాజరైనా బండి సంజయ్‌

కవితపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ వివరణ

bandi-sanjay-attends-before-ts-women-commission

హైదరాబాద్ః బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. బిజెపి లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి బండి సంజయ్‌ కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు.

కాగా, కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట బిఆర్‌ఎస్‌ నిరసనకు దిగింది. ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తల ఆందోళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బిఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.