హిమాచల్ ప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ఆవుల సెస్

ఒక్కో మద్యం బాటిల్ పై రూ. 10 కౌ సెస్ విధింపు

Himachal imposes ‘cow cess’ of Rs 10 per liquor bottle

సిమ్లాః మందుబాబులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మందు బాటిళ్లపై కౌ సెస్ (ఆవుల సుంకం) వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్కో బాటిల్ పై రూ. 10 సెస్ విధిస్తున్నట్టు బడ్జెట్ లో పేర్కొంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా అదనంగా రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సెస్ ను విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు తెలిపారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలోనే మద్యంపై కౌ సెస్ వసూలు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించింది.

ఇక హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే… రూ. 53,413 కోట్లుగా బడ్జెట్ ఉంది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ‘హిం-గంగా’ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ. 500 కోట్లను ఖర్చు చేయనున్నారు. 2,31,000 మందికి ప్రతి నెల రూ. 1,500 పింఛన్ అందించనున్నారు.