ఆర్ఆర్ఆర్ బ్యూటీకి కరోనా.. టెన్షన్‌లో ఫ్యాన్స్!

ఆర్ఆర్ఆర్ బ్యూటీకి కరోనా.. టెన్షన్‌లో ఫ్యాన్స్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. ఆమె నటిస్తున్న సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి విశేష స్పందన లభించింది. అయితే తాజాగా ఆలియా భట్‌కు కరోనా సోకినట్లు ఆమె ప్రకటించింది. కరోనా పాజిటివ్ రావడంతో, ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

ఆలియా భట్ త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా ఇటీవల ఆమెను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచించింది. అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న ఆలియాకు కరోనా సోకడంతో, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకిందేమో అనే సందేహం ప్రస్తుతం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.