మాల్దీవుల్లో పూజా హెగ్డే ఎంజాయ్ !

వరుస విజయాలతో దూసుకెళ్తున్న హాట్ బ్యూటీ పూజా హగ్దే..ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. వరుస షూటింగ్ లతో బిజీ బిజీ గా ఉన్న పూజా..షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరకడం తో మాల్దీవుల్లో ల్యాండ్ అయ్యింది. బీచ్ లో హాట్ హాట్ బికినీ లతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఆమె మాత్రమే కాదు ఆమె తాలూకా పిక్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను , నెటిజన్లను నిద్ర పోకుండా చేస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ లో మాల్దీవుల్లో ఒక ప్రత్యేకమైన ఇసుక ట్రాక్ పై నిలబడి ఏదో తథేకంగా పరిశీలిస్తున్న పోజ్ ఇచ్చింది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆలా వైకుంఠ పురం లో అల్లు అర్జున్ ఎలాగైతే పూజా కాళ్లు చూసి పడిపోతాడో..ఇప్పుడు పూజా పోస్ట్ చేసిన పిక్ కు కూడా అలాగే పడిపోతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే..అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంది. త్వరలో రాధే శ్యామ్ , ఆచార్య మూవీ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీ లో సల్మాన్ ఖాన్ సరసన , తమిళ్ లో విజయ్ సరసన నటిస్తుంది. అంతే కాకుండా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కబోయే మూవీ లోను ఈ అమ్మడినే ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.